జగన్‌ నాలుగేళ్లు ఉంటాడు, పోతాడు : బుద్ధి ఉన్నోడు ఎవడైనా విశాఖ వెళతాడా?

రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 02:19 AM IST
జగన్‌ నాలుగేళ్లు ఉంటాడు, పోతాడు : బుద్ధి ఉన్నోడు ఎవడైనా విశాఖ వెళతాడా?

Updated On : February 4, 2020 / 2:19 AM IST

రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి

రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి ప్రశ్నలు సంధించారు. అసలు బుద్ధి ఉన్న వాడెవడైనా రాజధానికి అమరావతి వదిలేసి విశాఖపట్నం వెళతాడా అని చంద్రబాబు అన్నారు. తమ గ్రామం నుంచి వచ్చే వారు అమరావతి వదిలి విశాఖపట్నం వెళ్లరని చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో సోమవారం(ఫిబ్రవరి 03,2020) మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుపడుతూ జాతీయ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయన్నారు. సీఎం  జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం తుగ్లక్‌ చర్య అని శేఖర్‌ గుప్తా చెప్పారంటూ ఆయన మాట్లాడిన వీడియో ప్రదర్శించారు. 

మూడు రాజధానులతో అభివృద్ది జరగదు:
అధికార వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరగదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. పైగా మూడు చోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల భారం ఇంకా పెరుగుతుందన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని చంద్రబాబు చెప్పారు. అమరావతిపై విచారణలు చేయిస్తామంటున్నారని.. గతంలో తనపై సీబీఐ కేసులన్నాయని.. అయితే ఆధారాలు చూపలేకపోయారని చెప్పారు. విశాఖపట్నంలో వేల ఎకరాలు చేతులు మారాయని త్వరలో అవి బయటకు వస్తాయని చంద్రబాబు అన్నారు.

రూ.50వేల కోట్ల పెట్టుబడి పోయింది:
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్‌ కంపెనీలు వస్తే పంపించేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పెట్టే సభలకు వెళ్లొద్దని ప్రజలను కోరారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకం కాదన్నారు చంద్రబాబు. అక్కడ కోర్టు పెట్టాలని గతంలో తామే చెప్పామన్నారు. మూడు రాజధానుల గురించి తన గ్రామం(నారావారిపల్లె) వెళ్లి సభ పెట్టాల్సిన అవసరం మంత్రులకు ఏం వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

అమరావతి దాటి విశాఖ వెళతారా?
చంద్రబాబు సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు సెటైర్లు వేశారు. ‘‘బుద్ధి ఉన్నోడు ఎవడైనా మా ఉరి నుంచి విశాఖపట్నం వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి విశాఖ వెళ్లాలని ఆలోచిస్తారా? వంద శాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా వస్తారు?’’ అని చంద్రబాబు అన్నారు. జగన్ పాలనలో బిహార్ కంటే దారుణంగా రాష్ట్రం తయారైందని విమర్శించారు.

ఏం పాపం చేసిందని కూల్చేశారు?
ప్రజావేదిక ఏం పాపం చేసిందని కూల్చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజావేదికను వేరే పనులకు ఉపయోగించుకోవచ్చు కదా.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు సీఎంకు ఎవరిచ్చారు? అని నిలదీశారు. ప్రభుత్వ చర్యల వల్ల పెట్టుబడులు కూడా రావని చెబుతున్నారని తెలిపారు. ఒక వ్యక్తి మూర్ఖత్వం వల్ల సోలార్‌, విండ్‌ ఎనర్జీ నాశనమయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ నాలుగేళ్లు ఉంటాడు, పోతాడు.. భావితరాల భవిష్యత్‌ ఏమవుతుంది?.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.