నాకు ఇంగ్లీష్ రాదా : నేను చేసిన అభివృద్ధి చూశాకే బిల్ గేట్స్, క్లింటన్ వచ్చారు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మూడో రోజు(డిసెంబర్ 11,2019) సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం గురించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 05:05 AM IST
నాకు ఇంగ్లీష్ రాదా : నేను చేసిన అభివృద్ధి చూశాకే బిల్ గేట్స్, క్లింటన్ వచ్చారు

Updated On : December 11, 2019 / 5:05 AM IST

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మూడో రోజు(డిసెంబర్ 11,2019) సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం గురించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మూడో రోజు(డిసెంబర్ 11,2019) సమావేశాల్లో ఇంగ్లీష్ మీడియం గురించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు టీడీపీ వ్యతిరేకం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ ద్వంద ప్రమాణాలతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 2017లో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే.. ఇప్పటికిప్పుడు ఎలా ప్రవేశపెడతారని.. జగన్ ప్రశ్నించారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందన్నారు. నాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంట అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. నేను చేసిన అభివృద్ధి చూశాకే బిల్ గేట్స్, బిల్ క్లింటన్ హైదరాబాద్ కి వచ్చారని చంద్రబాబు అన్నారు.

మర్యాదగా మాట్లాడండి:
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఇందుకు నిరాకరించిన స్పీకర్.. దీనిపై రేపు చర్చిస్తామని చెప్పారు. అయితే ఈ రోజే చర్చించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మర్యాదగా మాట్లాడాలి అంటూ స్పీకర్ ను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది.

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్, అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచితంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. ఏం మాట్లాడుతున్నారంటూ.. చంద్రబాబుపై సీరియస్ అయ్యారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. మీ అనుభవం ఎందుకు పనికొస్తుందని స్పీకర్ ప్రశ్నించారు. వెంటనే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చంద్రబాబుకి సూచించారు.