నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు

జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 11:05 AM IST
నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు

Updated On : November 18, 2019 / 11:05 AM IST

జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను

జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలను జైలుకి పంపుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడతామన్నారు. తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. నా పోరాటం పోలీసులపైన కాదన్న చంద్రబాబు… జగన్ ప్రభుత్వంపైన, దోపిడీ విధానంపైనే అని చెప్పారు. 

67 రోజుల తర్వాత జైలు నుంచి విడదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. సోమవారం(నవంబర్ 18,2019) చింతమనేని ఇంటికి వెళ్లారు చంద్రబాబు. చింతమనేని, ఆయన కుటుంసభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులే అని చంద్రబాబు అన్నారు.