ధరల స్ధిరీకరణకు 3 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం : సీఎం జగన్

రైతులను సీఎఁ జగన్ మోసం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం రైతు భరోసాపై ఈ రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి 6వేలు మాత్రమే ఇచ్చి మడమ తిప్పారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతురుణ మాఫీ చేసి చూపించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో పెద్దరైతులకు ఎవరికీ రైతు రైతు భరోసా అందలేదని.. వారికి మాయమాటలు చెపుతున్నారని, మాట తిప్పద్దని, మడమ తిప్పద్దని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట మీద నిలబడి రైతలుకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. రైతు రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు.
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి ….సీఎం జగన్
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని …గురువారం డిసెంబర్ 12న ప్రభుత్వం తరుఫున కనీస మద్దతు ధరపై ప్రకటన చేసి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు ప్రశ్నకు సమాధానంగా సీఎం జగన్ సమాధానం చెప్పారు. 3వేల కోట్ల రూపాయలు ధరల స్ధిరీకరణకు కేటాయిస్తున్నామని సీఎం చెప్పారు. దీంతో ప్రతి రైతుకు అండగా ఉంటామని… రైతులకు మేలు చేసేవిషయంలో నాలుగు అడుగులు ముందుకే ఉంటామని సీఎం జగన్ చెప్పారు.