కీలక ఘట్టం : హైకోర్టు శాశ్వత భవనానికి భూమిపూజ
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 450 ఎకరాల్లో భౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం జరగనుంది. అంతకుముందు నేలపాడులో ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీజేఐ గొగోయ్ ప్రారంభించారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. 14.2 ఎకరాల్లో రూ.173 కోట్లతో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు.
ఏపీకి కొత్త హైకోర్టు రావడం సంతోషంగా ఉందని, హైకోర్టు భవనం ఏపీ ప్రజల సంస్కృతి ప్రతిబింబించేలా ఉందని జస్టిస్ గొగొయ్ అన్నారు. హైకోర్టుని ఆధునిక శైలిలో నిర్మించారని జస్టిస్ రంజన్ గొగోయ్ కితాబిచ్చారు. రాజ్యాంగబద్ధమైన హైకోర్టును సకాలంలో నిర్మించి….సీఎంగా తన విధి చంద్రబాబు నిర్వర్తించారని ప్రశంసించారు. న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందన్న గొగొయ్ కొన్ని లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవన నిర్మాణం ప్రధాన ఘట్టమన్నారు. రాజధానికి భూములిచ్చి సహకరించిన రైతులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 34వేల ఎకరాల భూమి త్యాగం చేశారని కొనియాడారు. రైతులు భూములు ఇవ్వకపోయి ఉంటే….కోర్టు నిర్మాణం జరిగి ఉండేది కాదన్నారు.
పవిత్రమైన నేలలో రాజధాని నిర్మాణంతో పాటు శాశ్వత హైకోర్టు నిర్మించడం చారిత్రక ఘట్టం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమరావతి నేల నుంచే ప్రేమ, కరుణ, క్షమ అనే గుణాలను చాటిన బౌద్ధమతం.. విరాజిల్లిందని అన్నారు. ఈ గడ్డ నూతన రాష్ట్ర పాలనకు కేంద్రం కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్లు, హైకోర్టు ఐకానిక్ నమూనాను సీజే గొగోయ్, ఎన్వీ రమణ, చంద్రబాబు పరిశీలించారు. అమరావతిలో నిర్మిస్తున్న 9నగరాల గురించి గొగోయ్ దంపతులకు సీఆర్డీఏ కమిషనర్ వివరించారు.