గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ : సీఎం చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 05:49 AM IST
గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ : సీఎం చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.

అమరావతి : ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రాకుండా మోడీని అడ్డుకున్నారని తెలిపారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ ఏమైనా చేయగల సమర్ధుడని అన్నారు. 

రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న నేతలు వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పదవులపై ఆశలున్న వాళ్లకి తప్పుడు సర్వేలతో మధ్యపెడుతున్నారని పేర్కొన్నారు చంద్రబాబు. పార్టీ మారే వారి గురించి పట్టించుకోవద్దన్నారు. పింఛన్ల పెంపు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

పుల్వామా దాడి వెనక అనుమానాలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు కావాలనే ఈ దాడి చేయించారనే అనుమానం మమతా బెనర్జీ వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు.