నిరుద్యోగులూ ఏటీఎంలు చూసుకోండి: చంద్రబాబు రూ.2వేలు వేశారు
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం

అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం
అమరావతి: నిరుద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతిని రూ.2 వేలకు రెట్టింపు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు శనివారం(మార్చి-2-2019) ట్వీట్ చేశారు. శనివారం నుంచే రూ.2వేలు అకౌంట్స్‌లోకి జమ చేశామన్నారు. దేశానికి యువతీ యువకులే వెన్నుముక అని చంద్రబాబు అన్నారు. యువత తమకు నచ్చిన రంగంలో రాణించి భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం కింద అందిస్తున్న నిరుద్యోగ భృతిని రెట్టింపు చేసి రూ.2వేలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.
2014 ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 2వేల రూపాయల భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు అమల్లోకి తెచ్చారు. కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నెలకు వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. దాన్ని డబుల్ చేస్తున్నట్టు ఇటీవలే సీఎం చంద్రబాబు అనౌన్స్ చేశారు. కొత్త ఏడాది గిఫ్ట్‌గా సీఎం వరం ప్రకటించారు.
డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు ఇది అందుతుంది. 22 నుంచి 35 ఏళ్లు వయసు వారు అర్హులు. పేదలు, తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినా.. ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కుటుంబానికి ఒక్కరికే నిరుద్యోగ భృతి అన్న పరిమితి లేదు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇవ్వాలని నిశ్చయించారు. నిరుద్యోగ భృతిని ప్రతి నెలా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారు. రేషన్‌ను ఎక్కడైనా తీసుకున్నట్లే భృతిని ఎక్కడైనా తీసుకోవచ్చు. బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వారికి ఉచితంగా నైపుణ్యాల అభివృద్ది శిక్షణ ఇచ్చి సమాజానికి ఉపయోగపడే వర్క్‌ఫోర్స్‌గా తయారు చేస్తారు.