వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే?
మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.

YCP Rajya Sabha Candidates
YCP Rajya Sabha Candidates : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరు రెడ్డి సామాజికవర్గం, ఓ ఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇవాళ, లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి తుది నిర్ణయం ఇవాళ లేదా రేపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు గతంలోనే ఖరారు చేశారు. అయితే, మూడో వ్యక్తికి సంబంధించి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతనే పరిశీలిస్తున్నారు.
Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
మేడా రఘునాథ్ రెడ్డి.. మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు. మేఢా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. ఈ మూడు పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. అదే రోజున మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ కూడా జరగబోతోంది.
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరక్కుండా అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, అదే విధంగా అప్పుడు జరిగిన విధంగానే క్రాస్ ఓటింగ్ జరగకుండా ముందస్తుగానే వైసీపీ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. విచారణకు పిలిచారు. 8వ తేదీన మరోసారి రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవబోతున్నారు. ప్రత్యక్షంగా తమ వివరణ ఇవ్వబోతున్నారు.
Also Read : టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ప్రకటించిన ముద్రగడ