CM Jagan : అభ్యర్థులు మీరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

రానున్న 45 రోజులు మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవాలి.

CM Jagan : అభ్యర్థులు మీరే.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan Target 175

CM Jagan : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల అంశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా అన్ని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయినట్లు సీఎం జగన్ వెల్లడించారు. చిన్న చిన్న మార్పులు తప్ప.. ఇంఛార్జిలే అభ్యర్థులుగా ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. తమ తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు ఐదుసార్లు కలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. మేము సిద్ధం.. బూత్ సిద్ధం వర్క్ షాప్ లో సీఎం జగన్.. వైసీపీ నేతలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకం అని సీఎం జగన్ అన్నారు.

” మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలి” అని సీఎం జగన్ అన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం ఏయే సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనేది అనేకసార్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పడం జరిగింది. మరొకసారి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, పూర్తి స్థాయిలో ప్రజలను ఐదారుసార్లు కలిసి.. ప్రభుత్వం చేసిన పథకాలు, మంచి గురించి చెప్పాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఇప్పటివరకు నేను పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది.. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మార్పులు తప్ప.. మిగిలిన అభ్యర్థులు అంతా సిద్దంగా ఉననట్లు జగన్ చెప్పారు.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎవరైతే ఇంఛార్జిలుగా ఉన్నారో వారే అభ్యర్థులుగా ఉంటారని జగన్ చెప్పారు. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయి తప్ప.. మిగతా చోట్ల ఇంఛార్జులే అభ్యర్థులుగా కొనసాగుతారని జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలి? ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి? అన్న దాని గురించి సుదీర్ఘంగా గంటన్నర పాటు సీఎం జగన్ మాట్లాడారు.

జగన్ కామెంట్స్..
* 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి
* దాదాపు టికెట్లు కన్ ఫామ్ అయినట్లే
* ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపు ఫైనల్ లిస్ట్
* గతంలో 151 సీట్లు వచ్చాయి.. ఇప్పుడు 175 సీట్లు గెలవాలి
* 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే
* ఎన్నికల్లో గెలవాలంటే 45 రోజులు కష్టపడి పని చేయాలి
* ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లండి
* ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు
* పేదలు ఒకవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు
* జగన్ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు
* జగన్ గెలిస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది
* పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చాం
* జగన్ ఉంటే లంచాలు లేకుండా పథకాలకు అందుతాయి
* జగన్ ఉంటే స్కూళ్లు బాగుపడతాయి, విలేజ్ క్లినిక్ లు పని చేస్తాయి
* సంక్షేమం కొనసాగాలి అంటే జగన్ సీఎంగా ఉండాలి
* పేదవాడు బతకాలి అంటే వైసీపీ ప్రభుత్వం రావాలి