రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారు, మీరే నన్ను రక్షించాలి- సీఎం జగన్

దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా?

రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారు, మీరే నన్ను రక్షించాలి- సీఎం జగన్

CM Jagan Siddham

Updated On : February 3, 2024 / 6:52 PM IST

CM Jagan : రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని ప్రతిపక్ష నేతలపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్. రామాయణం, మహాభారతం లోని విలన్లు, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు అంతా ఏకమయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలి అని జగన్ కోరారు. దెందులూరులో సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.

”ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై కుట్ర చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి వీరందరికీ జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు. జగన్ ఒంటరి వాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం. కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండడమే నిజం.

Also Read : మళ్లీ అలిగిన ఎంపీ వేమిరెడ్డి.. ఏం జరుగుతుందో తెలుసా?

నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, కిందున్న మీరు. రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా? ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం.

ఎల్లో వైరస్ పై పోరాటానికి సిద్ధంగా ఉండాలి. జగన్ ఒంటరి వాడిలా వాళ్లకు కనపడుతున్నాడు. ఎంతోమంది తోడేళ్లకు జగన్ ఒంటరిగానే కనపడతాడు. కానీ అసలు నిజం ఈ సమావేశంలో కనపడుతున్న లక్షలాదిమంది గుండెల్లో జగన్ ఉండటం నిజం. నాకు ఉన్న బలం… ఫైన ఉన్న దేవుడు.. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండటం.

ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలి. మేనిఫెస్టోను 100శాతం అమలు చేసిన ఘనత మనది. జరుగుతున్న అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు చేధించేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి. గ్రామ గ్రామంలో మార్పు చేశాం. అందకు కేరాఫ్ అడ్రస్ గా గ్రామాలు నిలుస్తున్నాయి. 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలిచి తీరాలి” అని వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు.

Also Read : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట

”3సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చేసిన అభివృద్ధి.. మన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలపాలి. బ్యాంక్ ఆకౌంట్ లలో పదేళ్ల కాలంలో ఎంత జమ అయ్యాయో అడగాలి. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి పట్టణంలో వార్డ్ సచివాలయం కనపడతాయి. లంచాలు లేని పథకాలు అమలు చేస్తున్నది మీ జగన్ అని చెప్పాలి. నాడు-నేడుతో బడుల అభివృద్ధి గురించి ప్రజలకు తెలపండి” అని సీఎం జగన్ అన్నారు.