కరోనా : కేసీఆర్ అత్యవసర మీటింగ్ : సర్వత్రా ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : March 24, 2020 / 07:08 AM IST
కరోనా : కేసీఆర్ అత్యవసర మీటింగ్ : సర్వత్రా ఉత్కంఠ

Updated On : March 24, 2020 / 7:08 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అత్యవసర మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితి ఎలా కొనసాగుతుందో..అధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య, పోలీసు, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్ ఉంది. సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. తర్వాత సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరికొన్ని అనుమాన కేసులుగా ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..అంతగా ప్రభావితం చూపడం లేదని, ప్రజలు స్వచ్చందంగా తిరగడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. 

ప్రతి రోజు ఆరు కేసులు నమోదవుతుండడం, వైరస్ లక్షణాలున్న వారు..బహిరంగంగా తిరగడం జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు శాఖకు మరిన్ని అధికారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. 

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రకటించినట్లుగా రేషన్ బియ్యం సరఫరా తదితర వాటిపై పౌరసరఫరా అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. నిత్యావసర సరుకులు ఎప్పటి నుంచి పంపిణీ చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. 

ఐసోలేషన్ వార్డులో రోగులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆయన ఆరా తీయనున్నారు.  ఉంది. సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. తర్వాత సాయంత్రం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. 

See Also | కరోనా ఎఫెక్ట్: ఏపీలో పదోతరగతి పరీక్షలు మళ్లీ వాయిదా