మేడిగడ్డ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కుంగిన పిల్లర్ల పరిశీలన
డ్యామేజ్ అయిన పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ బృందం పరిశీలిస్తోంది.

Medigadda Barrage
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. సీఎం రేవంత్ ఆయన టీమ్ మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తోంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ బృందం పరిశీలిస్తోంది.
మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేల బృందానికి వివరిస్తోంది. అక్కడే ఉన్న ఇరిగేషన్ అధికారులు కూడా ప్రాజెక్ట్ గురించి వివరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ టీమ్ సమీక్ష నిర్వహిస్తుంది. రివ్యూ అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది.
Also Read : మేడిగడ్డ వెళ్తున్న సీఎం రేవంత్, మంత్రులకు కీలక సూచన చేసిన హరీశ్ రావు.. అదేమిటంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. రేవంత్ టీమ్ ఈ ఉదయం ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు చేరుకుంది.