ఏపీలో కరోనా లేదు, స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఈసీకి సీఎస్ లేఖ

ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల

  • Published By: veegamteam ,Published On : March 16, 2020 / 03:28 AM IST
ఏపీలో కరోనా లేదు, స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఈసీకి సీఎస్ లేఖ

Updated On : March 16, 2020 / 3:28 AM IST

ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల

ఏపీలో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై ఏకంగా సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ పై సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా వేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండానే రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జగన్ ఫైర్ అయ్యారు.

కేవలం ఒక వ్యక్తికే కరోనా ఉంది:
తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు రాశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రద్దు చేయాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, స్థానిక ఎన్నికలను యథాతథంగా నిర్వహించాలని అన్నారు. తమను సంప్రదించి ఉంటే కరోనా పరిస్థితిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లమని లేఖలో పేర్కొన్నారు. కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉందని చెప్పారు. స్థానికంగా ఎవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేశారు. 

పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చు:
రానున్న మూడు, నాలుగు వారాల్లో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉండదని సీఎస్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు పూర్తి చేయాలని కోరారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని లేఖలో వివరించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టొచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చన్నారు. మరో 3, 4 వారాల పాటు కరోనా అదుపులోనే ఉంటుందని ఎన్నికల కమిషనర్ కు రాసిన లేఖలో సీఎస్ తెలిపారు.

See Also | గవర్నర్ వద్దకు ఏపీ ‘స్థానిక’ పంచాయతీ : వివరాలతో ఈసీ రమేశ్ రెడీ..ఏం చెబుతారు

చంద్రబాబు కోసమే ఎన్నికలు వాయిదా:
కరోనా వైరస్ కారణంగా స్థానిక ఎన్నికలు 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రమేష్ కుమార్ వైఖరిని సీఎం జగన్ తప్పుపట్టారు. రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, వివక్ష చూపారని ఆరోపణలు చేశారు. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. అంతేకాదు రమేష్ కుమార్ పై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఎస్ఈసీ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను జగన్ కోరారు. సిగ్గుంటే రమేష్ కుమార్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వల్ల కాదు క్యాస్ట్ వైరస్ వల్లే ఎన్నికలు వాయిదా వేశారని విమర్శలు చేశారు. ఈ ఆరోపణలను రమేష్ కుమార్ ఖండించారు. ఎలాంటి వివక్ష చూపలేదన్నారు. కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలు వాయిదా వేశానని వివరించారు. ఇవాళ రమేష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్ కు వివరించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఏపీలో కరోనా లేదని, ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ కు సీఎస్ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.