DK vs Siddaramaiah: ఫలితాలు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోస్టర్ వార్
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్‌ను వేశారు. ఇక డీకే శివకుమార్‌కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల రాష్ట్ర తదుపరి 'ముఖ్యమంత్రి'..

Poster War: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనమైన మెజారిటీ సాధించింది. ఏకంగా 135 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవతోంది. అయితే ఇదే సమయంలోకాంగ్రెస్ పార్టీలోని పాత విబేధాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు విబేధాలు పక్కన పెట్టి గెలుపు కోసం పని చేసిన రేసుగుర్రాలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య మళ్లీ ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లే కనిపిస్తోంది.
వీరైతే బయటికి ఏమీ మాట్లాడలేదు కానీ, ఇద్దరి మద్దతుదారులు మాత్రం పోస్టర్ వార్‌కు తెరలేపారు. పార్టీ కార్యకర్తలు కూడా రెండు శిబిరాలుగా విడిపోయారు. ఒక వర్గం డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం మాజీ సీఎం సిద్ధరామయ్యకు మద్దతు ఇస్తోంది. ఫలితాలు వచ్చి ఇంకా 24 గంటలు కూడా గడవకముందే తమ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడంటే తమ నాయకుడే అవుతాడంటూ ఇద్దరు నాయకుల మద్దతుదారులు పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్ వార్ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా కాకరేపుతోంది.
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్‌ను వేశారు. ఇక డీకే శివకుమార్‌కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల రాష్ట్ర తదుపరి ‘ముఖ్యమంత్రి’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోస్టర్ వేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది డీకే శివకుమారేనని ఆ పోస్టర్లో రాసుకొచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ మెజారిటీ
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో మెజారిటీ సాధించింది. బీజేపీ కేవలం 66 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక రాష్ట్ర పార్టీ అయిన జేడీఎస్ 19 సీట్లు మాత్రమే సాధించింది. ఇతరులకు నాలుగు స్థానాలు వచ్చాయి.