క్రికెట్ Vs బాక్సింగ్: ఢిల్లీ బరిలో సెలబ్రిటీలు

2019 లోక్ సభ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలదే హవా మొత్తం. సిట్టింగ్ ఎంపీలను మార్చేసి ఆ స్థానంలో రాజకీయ ఓనమాలు తెలియని సెలబ్రిటీలను కూర్చే పెట్టడానికే పెద్ద పీట వేస్తున్నాయి జాతీయ పార్టీలు. ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఒక చోట నుంచి బీజేపీ అభ్యర్థిగా గంభీర్ దిగితే మరో స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజేందర్ సింగ్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ సోమవారం లోక్‌సభ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి విజేందర్ సింగ్‌తో కలిపి ఏడుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు. దీనికోసం ముందుగానే సిద్ధమైన విజేందర్.. డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఈయనకు పోటీగా బీజీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూరీ పోటీ చేయనున్నారు.
విజేందర్ స్వస్థలమైన హర్యానాకు దక్షిణ ఢిల్లీ స్థానం దగ్గరగా ఉండటంతో .. జాట్లు, గుర్జర్ సామాజిక వర్గాల ఓట్లు విజేందర్‌కు అనుకూలంగా వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.
మరో వైపు ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా గౌతం గంభీర్ పోటీ చేయనున్నారు. గంభీర్‌కు ఫ్రత్యర్థిగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అరవింర్ సింగ్ లవ్లీ పోటీచేస్తున్నారు.