ఉన్నట్లుండి ఈటల రాజేందర్ దూకుడు పెంచడంలో వ్యూహమేంటి? చేయి చేసుకోవడానికి కారణం అదేనా?

25ఏళ్లలో ఎప్పుడూ దురసుగా ప్రవర్తించని ఈటల..ఏనాడూ ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల.. ఎందుకు రియల్ట్ ఎస్టేట్‌ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది.

ఉన్నట్లుండి ఈటల రాజేందర్ దూకుడు పెంచడంలో వ్యూహమేంటి? చేయి చేసుకోవడానికి కారణం అదేనా?

Updated On : January 23, 2025 / 10:33 AM IST

Gossip Garage : ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిత్యం రోడ్డెక్కి పోరాడే వారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. రేపో మాపో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో ఈటల తీరు టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారింది.

25ఏళ్లలో ఎప్పుడూ దురసుగా ప్రవర్తించని ఈటల..ఏనాడూ ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల.. ఎందుకు రియల్ట్ ఎస్టేట్‌ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది. అందుకు ఆయన చెప్తున్న కారణం సరైందే అనుకున్నా..పేదలకు అన్యాయం జరుగుతుందనే సీరియస్‌ అయినా..ఈటల కోపాగ్రహం వెనుక ఇంకేదో మతలబు ఉందన్న చర్చ అయితే నడుస్తోంది.

కొన్నిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేసు ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర రథసారధి రేసులో ఈటల పేరు జోరుగా వినిపిస్తోంది. దాదాపుగా ఆయనకే పగ్గాలు దక్కబోతున్నాయన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న నేతకు అధ్యక్ష బాధ్యతలు దక్కబోతున్నాయి.? దూకుడుగా వెళ్ళే వారికే పదవి దక్కనుందా..? సౌమ్యంగా ఉంటూ పార్టీని నడిపించే వారికి పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నారా..? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఇదే సమయంలో ఎవరికి వారు తమను తాము ఎలివేషన్ చేసుకునే పనిలో పడ్డారట బీజేపీ నేతలు.

రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న నేతల్లో..ఎవరి క్యారెక్టరైజేషన్ వాళ్లకు ఉంది. ఒకరు సౌమ్యంగా ఉంటే మరొకరు దూకుడుగా ఉంటారు..ఇంకొకరు ముక్కుసూటిగా ఉంటారు. ఇందులోనే ఓ ఇద్దరు నేతలు లీగల్ పాయింట్స్ లాగుతారు. ఇందులో ఎవరు అధ్యక్షులు అవుతారనేది ఉత్కంఠ రేపుతుంది. అయితే తమను తాము మల్టీ క్యారెక్టర్స్‌గా ఎలివేషన్ చేసుకునే పనిలో పడ్డారట బీజేపీ నేతలు. అదిష్టానానికి తాను సౌమ్యంగానే ఉండటం కాదు అవసరం అయితే అగ్రెసీవ్‌గా కూడా ఉంటాను అనే ఇండికేషన్ ఇస్తున్నారట.

Also Read : ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారు- కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

అందులో భాగంగానే ఈటల రాజేందర్ రూటు మార్చారన్న టాక్ వినిపిస్తోంది. సైలెంట్‌గానే ఉంటాను ..సున్నితంగానే విమర్శిస్తాను..టైమ్‌ వస్తే ఇచ్చి పడేస్తాననే సంకేతాలు పంపాలనే అగ్రెసివ్‌ వెర్షన్ ఎలా ఉంటుందో చూపించారట ఈటల. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరు కాకపోతే 60 కేసులు పెట్టుకోండని స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కూడా ఓ ఎత్తుగడే అంటున్నారు.

ఈటల రాజేందర్‌ పేరెత్తితే చాలు సౌమ్యుడు. ఎవరి జోలికెళ్లడని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎవరిపై చేయ్యెత్తిన దాఖలాలు కూడా లేవు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో కూడా బూతులు తిట్టిన సందర్భం కూడా లేదు. కానీ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అంటూ ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈటల రాజేందర్ లాంటి నేత ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించడం ఏంటని పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌ చర్చ నడుస్తోంది. బాధితులకు అండగా ఉంటామని..పేదలకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని చెప్పడం అటుంచితే ఈటల రాజేందర్ ఇంత అగ్రెసివ్‌గా స్పందించడానికి కారణం ఏంటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని టాక్ వినినపిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నాడనేది కాదనలేని సత్యం. రాష్ట్ర అధ్యక్షుడి నియామానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భంలో ఈటల రాజేందర్ తీరులో మార్పు వెనక ఏదో రాజకీయ కోణం కూడా దాగి ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రెసివ్‌గా ఉండే నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడుతారనే చర్చ ఉంది. గతంతో బండి సంజయ్ దూకుడు వల్లే పార్టీ తెలంగాణలో ఈ స్థాయిలో ఎదగడానికి కారణమని..మరోసారి అలా దూకుడుగా పనిచేసే నేతకే బాధ్యతలు అప్పజెప్తే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉంటాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఇదే అంశాన్ని జాతీయ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటే తాను కూడా అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తినే అని..అవసరమైతే ఎంతవరకైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారట ఈటల. సో రెండు దశాబ్ధాలకుపైగా రాజకీయ అనుభం..ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నా..దూకుడే ప్రయారిటీ అయితే అదేంటో చూపిస్తానంటూ అగ్రెసివ్‌గా వెళ్లేందుకు సిద్ధమయ్యారట ఈటల. రాబోయే రోజుల్లో ఈటల దూకుడు ఎలా ఉండబోతుంది. పోచారం ఘటనతో ఈటలకు వచ్చిన మైలేజ్‌తో అధ్యక్ష పది దక్కబోతుందా అనేది చూడాలి మరి.

 

Also Read : ఇదేందిది కొత్తగా ఇంకొకటి.. పిల్లలు, యువతలో సడన్‌గా నరాల జబ్బు.. లక్షణాలు ఇవే.. చెక్ చేసుకోండి!