జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : చంద్రబాబు

ఢిల్లీ: సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామాజిక న్యాయం చేయటంలో తాను ముందుంటానని ఆయన చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ … జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. తన మంత్రివర్గంలోనూ, ప్రభుత్వ అధికారుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో అధికారులు సహకరించనే కారణంతో కులాల మధ్య చిచ్చు పెట్టే పద్దతి మానుకోవాలని హితవు పలికారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నీచమైన రాజకీయాలను చూడలేదని, వైసీపీ నాయకులు ఒక సామాజిక వర్గంవారు మద్దతిస్తారని వారికి వంత పాడటం సరికాదని చెప్పారు.