మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.

మంగళగిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు. జగన్ తన పాదయాత్ర కాలంలో 3648 కిలోమీటర్లు నడిచినందుకు గుర్తుగా 3648 కొబ్బరికాయలు కొట్టి వారు మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభంరోజు పాదయాత్ర విజయవంతంకావాలని ఆయన అభిమానులు స్వామికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావటంతో నేడు మొక్కుతీర్చుకున్నారు.
జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.