కృష్ణానదిలో జలదీక్ష : మోడీ దుర్మార్గమైన ప్రధాని : హీరో శివాజీ

విజయవాడ : గుంటూరులో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రత్యేక సాధన సమితి కార్యకర్తలు కృష్ణా నదిలో జల దీక్షకు దిగారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకొని పర్యటనకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హీరో శివాజీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ వాస్తవంగా ప్రధానమంత్రికి నిరసనలు తెలపడం మంచి పద్ధతి కాదు కానీ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన తెలపాల్సివస్తుందని హీరో శివాజీ అన్నారు. మోడీ ఏపీని దేశంలో లేని రాష్ట్రంగా ఆలోచిస్తూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. మన ఎన్నుకున్న ప్రధానికి వ్యతిరేకంగా మనమే నిరసనలు తెలపడం దేశంలో ఇదే ప్రథమం కావచ్చన్నారు. కేటాయింపులు వేరు ఖర్చు పెట్టడం వేరన్నారు. హామీలు ఇచ్చి మర్చిపోయారు. ఏపీ ప్రజలు మోడీ మాట నమ్మరని తెలిపారు. మోడీ దుర్మార్గమైన ప్రధాని విమర్శించారు. దేశంలో ఉండటానికి మోడీ అర్హుడు కాదన్నారు.
తిరుపతి వెంకన్న, దుర్గమ్మ సాక్షిగా ఇచ్చిన మాటలను ప్రధాని మరిచారని విమర్శించారు. భావితరాలకు చాలా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. కమ్యూనిస్టులు నిజాయితీగా పని చేశారు.. అందుకే వారు పిలిస్తే వెళ్లానని తెలిపారు. మాల మహానాడు పార్టీ తమతోపాటు ఉందన్నారు. నిరంతరం తనకు వెన్నుదన్నుగా ఉన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. హోదా కోసం ప్రభుత్వం ఎక్కడ కార్యక్రమాలను నిర్వహించినా తమను పిలిస్తే వెళ్తామని చెప్పారు.