రాజధాని తరలింపు వైసీపీ వినాశానికి దారి తీస్తుంది

ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ….5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకున్న తర్వాత వచ్చిన రాజధాని అని…33వేల ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిన రైతులు ఈరోజు రోడ్డు మీద పడ్డారని ….ఆడపడుచులని కూడా చూడకుండా పోలీసులు మహిళలపై విరుచుకు పడుతున్నారని అన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ది కావాలన్నదే కానీ తమ సిధ్దాంతమని ఆయన అన్నారు. రాజధాని పెడితే అభివృధ్ది వస్తుందని జనసేన పార్టీ నమ్మట్లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజధాని విషయమై త్వరలో బీజేపీ, జనసేన సంయుక్తంగా ఒక ప్రకటనచేస్తాయని ఆయన అన్నారు. రాజధాని అనేది రియల్ ఎస్టేట్ ఆట అయ్యిందని…రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వం దానిపై ఎందుకుచర్యలు తీసుకోలేదని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు ఉత్తరాంధ్రమీద ప్రేమ కాదని…ప్రశాంతంగా ఉన్న వైజాగ్ లో ఫ్యాక్షన్ చేయాలి…రియాల్ ఎస్టేట్ దందాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ నాయకులు ఇలాగే రియల్ ఎస్టేట్ దందాలుచేస్తేనే తరిమేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణ లో ఏ రియల్ ఎస్టేట్ దందా ఈ ఫ్యాక్షన్ నాయకులు చేశారో… ఇప్పుడు అదే దందా ఆంధ్ర రాష్ట్రం అంతా చేయబోతున్నారని దీన్ని మహిళలు, యువత అడ్డుకోవాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర పై ప్రేమ ఉంటే తిత్లి తుపాను వచ్చినప్పుడు ఈ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే విజయనగరం జిల్లాలో ముందు బోదకాలు వ్యాధి లేకుండా చేయాలి అని సూచించారు.
అమరావతి రాజధానిని ఇక్కడ్నించి కదపటానికి వీలులేదని మేము మొదటి నుంచి చెపుతున్నామని.. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఒకటే మాట మీద ఉన్నాయని రాజధాని ఒకే చోట ఉండాలి. అభివృధ్ది వికేంద్రీకరణ జరగాలన్నదే తమ అభిమతమని ఆయన అన్నారు. రాయలసీమలో హై కోర్టు ఉండాలనవి బీజేపీ డిమాండ్ చేసిందని దాన్ని మేము ఒప్పుకున్నాం అని జనసేనాని అన్నారు. గతంలో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే.. ఇప్పుడు వైసీపీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తోందని ఆయన అన్నారు.
ధర్నాచేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని… వారిని పరామర్సిస్తామంటే చేయనివ్వట్లేదని…పోలీసు అధికారుల కంటే కూడ …పోలీసులను నడిపిస్తున్న వైసీపీ రాజకీయ నాయకత్వం నశించాలని అన్నారు. ప్రశాంతంగా ఉన్నరాష్ట్రంలో అలజడి రేపారని…ఇది జాతీయస్ధాయిలో బలమైన మార్పులకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మా పార్టీ ఆఫీసులోంచి మమ్మల్ని కాలు బయటకు పెట్టనివ్వలేదు… మేము గుర్తుపెట్టుకుంటాం… మొన్న కాకినాడలోమీరు చేసింది మేము మర్చిపోము…చట్టానికి విరుధ్దంగా చేస్తున్నారు అని ఆయన వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.