కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది- జగన్ సర్కార్ పై పవన్ కల్యాణ్ ఫైర్

ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, ఎవరి పక్షాన నిలవకుండా ఒక నిజమైన జర్నలిస్టు రిపోర్టు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ విధ్వంసం పుసక్తాన్ని ఆలపాటి సురేశ్ అంత గొప్పగా రాశారు.

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది- జగన్ సర్కార్ పై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan Fires On CM Jagan

Pawan Kalyan : జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది అని పవన్ అన్నారు. నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నాను అని పవన్ గుర్తు చేశారు. విజయవాడలో ”విధ్వంసం” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్కాణ్.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

”ఎందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలి. ఓటు ఎందుకు చీలకూడదు. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేశ్ రచించిన విధ్వంసం పుస్తకం ఉపయోగపడుతుంది. ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, ఎవరి పక్షాన నిలవకుండా ఒక నిజమైన జర్నలిస్టు రిపోర్టు చేస్తే ఎలా ఉంటుందో.. ఈ విధ్వంసం పుసక్తాన్ని ఆలపాటి సురేశ్ అంత గొప్పగా రాశారు.

Also Read : ప్రజలే కాదు నేనూ బాధితుడినే, సైకో పాలనలో అంతా విధ్వంసమే- సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు

ఒక నిజమైన జర్నలిస్టు ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు. ప్రజాస్వామ్య విలువలను ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టింది. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని నేను పదే పదే చెబుతుంటాను. ఎందుకు ఆ మాట అన్నాను అంటానికి ఈ పుస్తకమే నిదర్శం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

జర్నలిస్టు విలువలతో ఎంతో అద్భుతంగా విధ్వంసం పుస్తకాన్ని రచించినందుకు ఆలపాటి సురేశ్ కుమార్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నికల అయిన వెంటనే కూల్చివేతలతో పాలన ప్రారంభమైంది. అమరావతి రైతుల మీద దాడి జరిగినప్పుడు గుండె చెదిరిపోయింది. ఆడపడుచుల మీద అఘాయిత్యాలు చూసి చాలా బాధ కలిగింది. పాలకుల దాష్టీకాన్ని తట్టుకోగలమా అని అనిపించేది.

Also Read : ఏపీని షేక్ చేస్తున్న నెల్లూరు పెద్దారెడ్ల పొలిటికల్ ఇష్యూస్

ఈ పుస్తకం భారత దేశానికే, ముఖ్యంగా ప్రతీ పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదో ఈ పుస్తకం తెలియజేస్తుంది. ప్రజా క్షేమాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్టు రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఈ పుస్తకాన్ని ఒక టచ్ స్టోన్ లా జనసేన తీసుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.