Janasena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన.. పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే

ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని, ఒంటరిగా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. Janasena

Janasena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన.. పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే

Janasena in Telangana polls

Updated On : October 2, 2023 / 6:51 PM IST

Janasena – Telangana Assembly Elections : ఎన్నికల బరిలోకి జనసేన దిగనుంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ జనసేన విభాగం ప్రకటన చేసింది. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని, ఒంటరిగా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు.

జనసేన పోటీ చేసే 32 నియోజకవర్గాలు ఇవే..
కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్‌ వెస్ట్‌, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, ఖానాపూర్‌, మేడ్చల్‌, పాలేరు, ఇల్లందు, మధిర.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన.. 32 చోట్ల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోటీచేసే స్థానాల జాబితాను సోమవారం(అక్టోబర్ 2) సాయంత్రం విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ తెలిపింది. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండొచ్చంది.

”యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ జనసేన స్థాపించారు. ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేశారు. దాదాపు 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో మా ఓటింగ్‌ ఉంది. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్‌ ఎన్నికే ఇందుకు ఉదాహరణ. ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

గత పదేళ్లలో అనేక సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసింది నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్‌ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థుల సమస్యలు.. ఇలా అనేక అంశాలపై పోరాటం చేశాము” అని తెలంగాణ జనసేన విభాగం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో 7 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఈసారి 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి రెడీ అయ్యింది.