అంబేద్కర్‌కు విగ్రహం అవసరమా? దమ్ముంటే నాతో చర్చకు రండి- చంద్రబాబు, జగన్‌కు కేఏ పాల్ సవాల్

టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.

అంబేద్కర్‌కు విగ్రహం అవసరమా? దమ్ముంటే నాతో చర్చకు రండి- చంద్రబాబు, జగన్‌కు కేఏ పాల్ సవాల్

KA Paul

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. దమ్ముంటే.. నాతో చర్చకు రండి అని.. వారికి చాలెంజ్ చేశారు పాల్. విజయవాడలో కేఏ పాల్ మాట్లాడారు. మీడియా మీద దాడి చేయడం సిగ్గు చేటు అన్నారు. మీడియాపై దాడిని ఆయన ఖండించారు.

దమ్ముంటే నాతో చర్చకు సిద్ధమా.. అంటూ సీఎం జగన్ కి చంద్రబాబు చేసిన సవాల్ గురించి కేఏ పాల్ ప్రస్తావించారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నేను సవాల్ చేస్తున్నా.. నాతో చర్చకు రావాలి.. అని కేఏ పాల్ అన్నారు. అంబేద్కర్ కి విగ్రహం అవసరమా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. దళితలు.. విగ్రహాలతో మోసపోరు అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

”బడుగు, బలహీన వర్గాల వారికి నా విన్నపం. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు. విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగారా? నేను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించను. పవన్ కల్యాణ్ ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. జగన్ చొక్కాలు ఎట్టాలని అంటున్నారు. చంద్రబాబు కుర్చీలు ఎత్తమంటున్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ నాకెందుకు? వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తా” అని హాట్ కామెంట్స్ చేశారు కేఏ పాల్.

Also Read : జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?