నాగబాబుకు అనకాపల్లి సీటు..? అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పవన్ కల్యాణ్

ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ, జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు.

నాగబాబుకు అనకాపల్లి సీటు..? అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పవన్ కల్యాణ్

Konidela Nagababu

Konidela Nagababu : ఉమ్మడి విశాఖ నియోజకవర్గ సమన్వయకర్తలతో భేటీ కానున్నారు. టీడీపీతో పొత్తుల నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో సీట్లు ఆశిస్తున్న జనసేనాని నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కరితో విడివిడిగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు పవన్ కల్యాణ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పలు స్థానాల్లో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఎన్నికల వేళ.. తుఫాన్‌లా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు

మెగా సోదరుడు కొణిదెల నాగబాబు గత పది రోజులుగా అనకాపల్లిలో పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారనే సంకేతాలు పంపుతుండటం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ, జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు. అయితే, నాగబాబు పోటీ చేస్తారని బహిరంగంగా ఎవరూ చెప్పలేదు. దీంతో ఈ సమావేశాల్లో నాగబాబు పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఈ నియోజకవర్గం టీడీపీకి అచ్చిరావడం లేదా? ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనుంది?

జనసేన ముఖ్య నాయకులతో కీలక అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాల్సిన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత పది రోజులుగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మకాం వేశారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమైన నాయకులతో సమావేశం అవుతున్నారు నాగబాబు. పాయకరావుపేట మొదలు చోడవరం, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి అన్ని నియోజకవర్గాల్లోనూ నాగబాబు సమావేశాలు నిర్వహించారు. అచ్యుతాపురంలో ఇల్లు కూడా తీసుకుని పూర్తి స్థాయిలో అక్కడే ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇవాళ్టి పవన్ కల్యాణ్ భేటీలో అనకాపల్లి లోక్ సభ ఎంపీ అభ్యర్థి పై కచ్చితంగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 20, 21 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కాళ్ల మండలం పెదామిదంలోని నిర్మల ఫంక్షన్ హాల్ లో సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన, టీడీపీ నేతలతో భేటీ కానున్న పవన్.. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా.. హెలిప్యాడ్ కు అధికారులు అనుమతి నిరాకరించడంతో పర్యటన వాయిదా పడింది. కాస్మోపాలిటిన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జనసేన నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Also Read : దెబ్బకు రెండు పిట్టలు.. జగన్ మాస్టర్ స్ట్రోక్.. సింగిల్‌ లిస్ట్‌తో మూడు నియోజకవర్గాల సమస్యకు చెక్‌..!