కాంగ్రెస్ కు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 01:30 PM IST
కాంగ్రెస్ కు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గుడ్ బై

Updated On : February 27, 2019 / 1:30 PM IST

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.

కర్నూలు : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఫిబ్రవరి 27 బుధవారం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ రాజీనామా చేశారు. మార్చి 2న చంద్రబాబు సమక్షంలో కోట్ల దంపతులు టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రజల కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సి రావడం బాధాకరణమన్నారు. పార్టీని నమ్ముకుని పని చేసిన తమ కుటుంబానికి గుర్తింపు దక్కలేదని వాపోయారు. ఆరు దశాబ్ధాలుగా కాంగ్రెస్ లోనే ఉన్నామని..పార్టీని బతికించుకోవాలని చాలా ప్రయత్నించామన్నారు. 

చంద్రబాబును కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరానని.. ఆ ప్రాజెక్టులు ఇస్తేనే టీడీపీలో చేరుతానని చెప్పినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు హామీ మేరకే టీడీపీలో చేరుతున్ననట్లు ప్రకటించారు. కొందరు తెలిసీతెలియక మాట్లాడుతున్నారని..చంద్రబాబుకు తప్పుడు జీవోలు ఇవ్వాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని జోస్యం చెప్పారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.