ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతే

  • Published By: chvmurthy ,Published On : January 2, 2019 / 12:27 PM IST
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతే

Updated On : January 2, 2019 / 12:27 PM IST

విజయవాడ: వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ లో నేను ప్రత్యక్షసాక్షినే అని హీరో శివాజీ అన్నారు. ఆనాడు చంద్రబాబు చేసింది వెన్నుపోటుకాదు, పార్టీకి వెన్నుదన్ను అని ఆయన అన్నారు. ఆరోజు చంద్రబాబు లేకపోతే వాజ్ పేయి 2వ సారి పీఎం అయ్యేవారుకాదని,దాంతోనే ఈరోజు  బీజేపీ పెద్ద పార్టీగా ఆవిర్భవించిందని శివాజీ అన్నారు. విజయవాడలో  జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శివాజీ… ఆరోజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రోజు టీడీపీ ఉండేది కాదని, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదు కాబట్టే మళ్లీ ప్రజలు ఆయన్నుగెలిపించారని  అన్నారు.
టీడీపీని లక్ష్మీపార్వతి కబ్జా చేస్తున్నారనే భయంతోనే ఆనాడు కేసీఆర్ తో సహాఅందరూ చంద్రబాబుకు వెన్నుద్ననుగా ఉన్నారని, వెన్నుపోటు అనే మాటను ప్రజలు అంగీకరించలేదని అందుకే చంద్రబాబు  శివాజి చెప్పారు. టీడీపీకి వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతేనని శివాజీ చెప్పారు. ఆనాటివీడియోలన్నీ యూట్యూబ్ లో ఉన్నాయని ప్రజలందరూ చూడోచ్చని శివాజీ  తెలిపారు.