లక్ష్మీస్ NTRపై టీడీపీ రచ్చ మొదలైంది: వర్మ

లక్ష్మీస్ NTRపై టీడీపీ రచ్చ మొదలైంది: వర్మ

Updated On : March 12, 2019 / 10:59 AM IST

కాంట్రవర్సీ డైరక్టర్ RGV (రామ్ గోపాల్ వర్మ) లక్ష్మీస్ NTR మూవీపై అనుకున్నట్లుగానే రచ్చ మొదలైంది. బహిరంగంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్డుకోవడానికి ఎవ్వరికీ హక్కులేదని చెప్పిన వర్మకు.. అడ్డుగా టీడీపీ కార్యకర్తలు నిలుస్తున్నారు. ఈ సినిమా నిలిపేయాలంటూ నేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కే వెళ్లి ఫిర్యాదు చేశాడట టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేస్తూ వర్మ పోస్టు చేశాడు. 
Read Also : ఎవర్నీ వదలడు : లక్ష్మీస్ ఎన్టీఆర్ లోకి మోడీని లాగిన వర్మ

టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా విడుదల నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కోరుతూ ఫిర్యాదు చేశారు. ఏదేమైనా సరే సినిమాను మార్చి 22న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించామని, సినిమా ఓటర్లపై ప్రభావం చూపుతుందని ఎన్నికలైపోయాక రిలీజ్ అయినా పరవాలేదని డిమాండ్ చేశారట. 

ఈ పోస్టు పెట్టిన కాసేపటికే నెటిజన్ల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతోంది. రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ చేసి తీరతాడని.. నిజాలు తెలుసుకోవాలని ఉందని వర్మ అభిమానులు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలపై ఆర్జీవీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్లతో ఓ రేంజ్ లో మూవీకి పబ్లిసిటీ వచ్చింది. దీనికితోడు ఎలక్షన్ సీజన్. సరిగ్గా పోలింగ్ కు 20 రోజుల ముందు మూవీ రిలీజ్ చేస్తున్నాడు.. ఆ మాత్రం కాలదా ఏంటీ టీడీపీ వాళ్లకు.. 
Read Also : ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ…పంజా విసిరిన చిరుత