పోలింగ్ జరగలేదు..ఫలితాలు రాలేదు..TRSలో ఫుల్ జోష్

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 01:12 AM IST
పోలింగ్ జరగలేదు..ఫలితాలు రాలేదు..TRSలో ఫుల్ జోష్

Updated On : January 15, 2020 / 1:12 AM IST

పోలింగ్‌ జరగలేదు, ఫలితాలు రాలేదు. అప్పుడే టీఆర్‌ఎస్‌ ఖాతాలో వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు ఛైర్మన్‌ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది గులాబీ పార్టీ. 80కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుని.. భవిష్యత్‌ ఫలితాన్ని అంచనా వేసుకుంటోంది. 

* గులాబీ పార్టీలో ఏకగ్రీవాల జోష్
* టీఆర్‌ఎస్‌ ఖాతాలో రెండు చైర్మన్‌, 80కి పైగా స్థానాలు
* పోలింగ్‌పైనా ప్రభావం ఉంటుందని అంచనా
* స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం అవుతాయంటున్న టీఆర్‌ఎస్‌

తెలంగాణలోని 120 పట్టణాలు, 9 కార్పొరేషన్లలో నామినేష్లన ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. చివరిక్షణం వరకూ అన్ని పార్టీలు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం, రెబల్స్‌ను బుజ్జగించడంపై దృష్టిపెట్టాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలతో అక్కడ ఆలస్యంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 2020, జనవరి 16వ తేదీతో గడువు ముగియనుంది.

 

రాష్ట్రవ్యాప్తంగా 2020, జనవరి 22న పోలింగ్, 25న కౌంటింగ్ జరగనుంది. కరీంనగర్‌లో మాత్రం 25న పోలింగ్, 27న కౌంటింగ్ నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. అంతే సీరియస్‌గా ఏకగ్రీవాలపై దృష్టి పెట్టింది. ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్న వార్డులను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత 34 పట్టణాల నుంచి 80కి పైగా స్థానాలు ఏకగ్రీవంగా అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

వీటితో పాటు రెండు చైర్మన్ స్థానాలు కూడా అధికార పార్టీ ఖాతాలో పడినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి అందిన సమాచారం ప్రకారం 85 కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పరకాలలో 11 చెన్నూరులో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఆ మున్సిపాలిటీలు దాదాపు టీఆర్ఎస్‌ ఖాతాలోకి చేరిపోయినట్లే అంటున్నారు ఆ పార్టీ నేతలు. రికార్డు స్థాయిలో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతుండడంతో.. అధికార పార్టీ నేతల్లో జోష్ మరింత పెంచుతోంది.

 

ఈ ప్రభావం పోలింగ్‌పై కూడా ఉంటుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. తద్వారా మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు 400 స్థానాలకు, బీజేపీకి 700 స్థానాలకు అభ్యర్థులు లేకపోవడంతో పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధం అవుతున్నాయని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

* గులాబీ పార్టీలో ఏకగ్రీవాల జోష్
* టీఆర్‌ఎస్‌ ఖాతాలో రెండు చైర్మన్‌, 80కి పైగా స్థానాలు
* పోలింగ్‌పైనా ప్రభావం ఉంటుందని అంచనా
* స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం అవుతాయంటున్న టీఆర్‌ఎస్‌
 

* ఈనెల 16తో ముగియనున్న గడువు 
* రాష్ట్రవ్యాప్తంగా 22న పోలింగ్, 25న కౌంటింగ్ 
* కరీంనగర్‌లో 25న పోలింగ్, 27న కౌంటింగ్ 
* ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్
 

* 80కి పైగా స్థానాలు ఏకగ్రీవం
* టీఆర్‌ఎస్‌ ఖాతాలో రెండు చైర్మన్ స్థానాలు కూడా..
* 85 కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవం 
* పరకాలలో 11, చెన్నూరులో ఏడుగురు ఏకగ్రీవం 
* పోలింగ్‌పై ఏకగ్రీవం ప్రభావం

Read More : ఒకటంటే రెండంటాం : పవన్‌కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్