ఇసుక కొరతపై నారా లోకేశ్ నిరసన దీక్ష
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.

ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు.
ఏపీలో కొన్నాళ్ల క్రితం మొదలైన ఇసుక దుమారం.. ఇప్పుడు తుపానుగా మారింది. ఇసుక కొరతతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులకు కుటుంబ పోషణ భారమవుతోంది. చేయడానికి పనిలేక.. సంపాదనకు వేరే మార్గం లేక.. ఇటు పస్తులుండలేక.. అటు కుటుంబాన్ని పోషించలేక.. కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెలరోజుల్లోనే ముగ్గురు కార్మికులు సూసైడ్ చేసుకోవడం రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది. ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై టీడీపీ నేత నారా లోకేశ్ ఒక్కరోజు నిరసన దీక్ష చేయనున్నారు. బుధవారం (అక్టోబర్ 30, 2019) ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్ష చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారన్న అంచనా ఉంది. ఇసుక కొరతతో.. వీరికి పనుల్లేకుండా పోయాయి. కేవలం రోజువారీ పనులతోనే వీరి జీవనం గడుస్తుంది. ఇసుక దొరికితేనే.. భవన నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంటుంది. అప్పుడే వీరికి పని దొరుకుతుంది. కానీ రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదు. రోజూ పనిదొరికితేనే.. కార్మిక కుటుంబాల పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు చేయడానికి పనిలేక.. ఆదాయానికి అడ్డుకట్ట పడ్డట్లైంది. భవన నిర్మాణం రంగంలో తప్ప.. మరే పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారంతా. దీంతో.. కుటుంబ పోషణ భారమై.. పస్తులు ఉండలేక కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నారు.