పసుపు బోర్డు డౌటే : మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 10:51 AM IST
పసుపు బోర్డు డౌటే : మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ

Updated On : December 13, 2019 / 10:51 AM IST

నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్‌ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నారు. నెలరోజుల్లో పసుపు రైతులకు శుభవార్త చెబుతామని.. ఓపిక పట్టాలన్నారు.

పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై ఎంపీ అరవింద్‌.. 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం కేంద్రమంత్రులు అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌ను కలిశారు. పసుపు దిగుమతి నిలిపేయాలని కేంద్రాన్ని కోరామని..ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంటకాదు. అయినా సరే పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాలన్నారు అరవింద్‌. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. బోర్డు స్థానంలో వేరే పథకం తీసుకొస్తారా అనేది వేయిట్ చేయాల్సిందే. 

* గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి ఎంపీగా ధర్మపురం అరవింద్ గెలిచారు. 
* పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో నేతలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ..పెద్ద సంఖ్యలో రైతులు నామినేషన్లు వేశారు. 
* పసుపు బోర్డు తెస్తానని అరవింద్ హామీనివ్వడంతో ఆయన గెలిచారనే ప్రచారం జరిగింది.

* సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందారు. 
* అయితే..గెలిచిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు విషయంలో క్లారిటీ ఇవ్వకపోడంతో రైతులు మరో ఉద్యమం చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. 
* తాజాగా నెల రోజుల్లో అంటే..కొత్త సంవత్సరం 2020లో రైతులకు శుభవార్త వినిపిస్తామని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు నిజమౌతాయా ? లేదా ? అనేది చూడాలి. 
Read More : గాలి నుంచి వాటర్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లీటర్ బాటిల్ రూ.5