నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం
10మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.

Narayankhed Municipality
Narayankhed Municipality : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం అయ్యింది. అవిశ్వాస పరీక్షలో నెగ్గి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అవిశ్వాస పరీక్షలో మున్సిపల్ చైర్ పర్సన్ రుబీనా బేగం, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరుకాలేదు. 10మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.
Also Read : కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తొందరపడొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛైర్ పర్సన్ రుబీనా బేగం, వైఎస్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్. మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు. 15 మంది ఎలక్టడ్ కాగా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు. మొత్తం 18మంది ఉన్నారు. వారిలో 2/3వ వంతు మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే 12మంది అవసరం. అయితే, 13మంది హాజరయ్యారు. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్తులే ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి హాజరు కావడంతో మొత్తం 13మంది సభ్యుల మెజార్టీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ ముగ్గురు కౌన్సిలర్లు కూడా గైర్హాజరు కావడంతోనే ఏకపక్షంగా తీర్మానం నెగ్గింది.
Also Read : ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా