తెలంగాణలో కరోనా లేదు…భయపడవద్దు : కేసీఆర్ 

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 04:24 PM IST
తెలంగాణలో కరోనా లేదు…భయపడవద్దు : కేసీఆర్ 

Updated On : March 14, 2020 / 4:24 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం శాసనసభలో చర్చ జరిగిందన్నారు. కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ ఏదో వ్యాధి ఉందంటూ…ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. సుదీర్ఘంగా భేటీ అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను స్వయంగా కేసీఆర్ మీడియాకు వివరించారు. 

భారతేదేశంలో పుట్టిన వైరస్ కాదని, చైనాలో పుట్టి..దేశాలకు విస్తరిస్తోందన్నారు. ఒక వ్యక్తి మాత్రమే వచ్చిందని, ఇతర దేశం నుంచి బెంగళూరుకు వచ్చి..తెలంగాణకు వచ్చాడని గుర్తు చేశారు. ఇతనికి క్యూర్ అయ్యిందని..బ్రతికాడన్నారు. మార్చి 14వ తేదీన కరోనా వైరస్ లక్షణాలున్న వారి నమూనాలను తీసుకుని..పూణేకు పంపించడం జరిగిందన్నరు. ఇందులో ఒకరికి పాజిటివ్ ఉందని, ఇతను బాగానే ఉన్నాడని తెలిపారు. 

దేశంలో 83 మందికి లక్షణాలు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయని, 63 మంది భారతీయులు ఉంటే..మిగతా వారు ఫారెనర్స్ అని తెలిపారు. వీరిలో ఇద్దరు మాత్రమే చనిపోయారన్నారు. 130 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 83 మంది మాత్రమే వైరస్ సోకిందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయంగా వస్తుంది..కానీ దేశీయంగా లేదు.. సముద్ర తీరం, పోర్టుల బెడద లేదన్నారు. రూరల్ ఏరియా ప్రాంతాల్లో భయం లేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 
Read More : కరోనా వైరస్..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలివే