Narendra Modi : కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

Narendra Modi : బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.

Narendra Modi : కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే

Narendra Modi

Updated On : May 14, 2023 / 1:03 AM IST

PM Modi On Karnataka Results : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

తాజాగా కర్నాటక ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ” ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి నా శుభాకాంక్షలు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. బీజేపీ కార్యకర్తల కృషిని నేను అభినందిస్తున్నా. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేద్దాం” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మోదీ.(Narendra Modi)

Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136, బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచి ఆధిక్యంలో నిలిచింది. ఆ పార్టీ ఆశించిన దాని కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.

కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత రీతిలో ఫలితాలను సాధించింది. బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.(Narendra Modi)

అటు.. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్రను పోషించాలనుకున్న కుమారస్వామి ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కడంతో జేడీఎస్ అవసరం ఆ పార్టీకి లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Also Read..Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది

ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందించారు. కర్ణాటక ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు. గెలుపోటములను తాము సమానంగా స్వీకరిస్తామని చెప్పారు. ఈ ఓటమే తమకు ఫైనల్ కాదన్నారు. తాము ఎప్పుడూ ప్రజలతోనే ఉంటామని తెలిపారు.

ఓటమి తనకు కానీ, తన కుటుంబానికి కానీ కొత్త కాదని కుమారస్వామి అన్నారు. గతంలో తాను, తన తండ్రి దేవెగౌడ, తన సోదరుడు రేవణ్ణ కూడా ఓడిపోయామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన కుమారస్వామి.. నూతన ప్రభుత్వం ప్రజల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆకాంక్షించారు.(Narendra Modi)