చొక్కా విప్పించి ఓటు వేయించాడు : ఎర్రచొక్కా చూసి శివాలెత్తిన ఖాకీ డ్రస్

సూర్యాపేట: ఎర్రచొక్కా చూసి శివాలెత్తిపోయాడు ఓ ఖాకీ డ్రస్… పంచాయతీ ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చిన ఓటరు ఎర్ర చొక్కా వేసుకువచ్చాడని అభ్యంతరం చెప్పి అతడ్ని చొక్కా విప్పించాడు కానిస్టేబుల్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో ఈ ఘటన జరగింది. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయటానికివచ్చిన ఒక ఓటరు రెడ్ షర్ట్ వేసుకున్నాడని ఆ ఓటరును పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు పోలీసు. చొక్కా విప్పించి క్యూలైన్‌లో నిలబెట్టారు. దీంతో ఆగ్రహించిన ఓటరు, అతని కుటుంబీకులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో అక్కడున్న ఓటర్లు, పై అధికారులు స్పందించి ఓటరుకు సర్దిచెప్పారు. దీంతో బనియన్ మీదనే ఓటు హక్కు వినియోగించుకున్నాడు బాధిత ఓటరు.