Ktr Jail Comments : నేను చెప్పింది తప్పు అయితే జైలుకి వెళ్లేందుకు సిద్ధం- కేటీఆర్ సంచలనం

ఈసీ స్వతంత్ర సంస్థ అయితే మోడీకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? సీఎం ప్రవచనాలు ఎన్నికల కమిషన్ కు కనిపించవా?

Ktr Jail Comments : నేను చెప్పింది తప్పు అయితే జైలుకి వెళ్లేందుకు సిద్ధం- కేటీఆర్ సంచలనం

Ktr Jail Comments : ప్రజల్లో కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆయన ప్రచారంపై నిషేధం విధించేలా చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ నేతలపై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదన్నారు. ఓయూ హాస్టల్స్ మూసివేత విషయంలో సీఎం రేవంత్ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో తాను జైలుకి వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు కేటీఆర్.

ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా చర్యలు లేవని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ దారుణంగా మాట్లాడారని, మోడీ వ్యాఖ్యలపై 20వేలకుపైగా ఫిర్యాదులు చేశారని, మోడీపై ఫిర్యాదు చేస్తే.. నడ్డాకు ఈసీ నోటీసులు ఇచ్చిందన్నారు. అమిత్ షా పై కూడా ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. రాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు ఆడుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ గొంతు నొక్కుతూ ఈసీ నిర్ణయం తీసుకుందని వాపోయారు.

”సీఎం రేవంత్ పై 8 ఫిర్యాదులు చేశాము. సీఎం ప్రవచనాలు ఎన్నికల కమిషన్ కు కనిపించవా? కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెడితే కాంగ్రెస్, బీజేపీ లకు దడ మొదలైంది. బీఆర్ఎస్ కు 8 నుంచి 12 స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రచారం నిషేధంపై ఓటుతో బుద్ధి చెప్పాలి. ఈసీ స్వతంత్ర సంస్థ అయితే మోడీకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? సీఎం ఫేక్ డాక్యుమెంట్ ట్విట్టర్ లో పెట్టి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. మా విద్యార్థి నేతను అరెస్ట్ చేశారు.

జైల్లో ఉండాల్సింది ఎవరు? నేను చెప్పింది తప్పు అయితే నేను జైలుకి వెళ్లేందుకు సిద్ధం. సీఎం రేవంత్ కూడా రెడీ కావాలి. నకిలీ సర్క్యులర్ తయారు చేసిన సీఎంపై చర్యలు తీసుకోవాలి. క్రిశాంక్ పై అక్రమ కేసులు పెట్టారు. సీఎం రేవంత్ పైనా ఓయు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఇలాగే దాడి జరుగుతోంది” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

Also Read : సీఎం రేవంత్‌కు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఢిల్లీ పోలీసులు