బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్..? ఎందుకిలా.. కారణం ఏమిటి..

మాతృ సంస్థకు ప్రధాని మోదీ ఎక్కడ కోపం తెప్పించారు?

బీజేపీపై ఆగ్రహంగా ఉన్న ఆర్ఎస్ఎస్..? ఎందుకిలా.. కారణం ఏమిటి..

RSS On BJP : బీజేపీ అడుగు తీసి అడుగు వేయాలన్నా.. ఆర్ఎస్ఎస్ నుంచి ఆదేశాలు రావాల్సిందే అన్న మాట ఒకటి రాజకీయాల్లో ప్రచారంలో ఉంటుంది. బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ వేర్వేరు కాదని ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమే బీజేపీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. మరి అటువంటి ఆర్ఎర్ఎస్, బీజేపీ మధ్య ఎన్నికల ఫలితాల తర్వాత ఏం జరుగుతోంది? తన లక్ష్యాలు నెరవేర్చే రాజకీయ పార్టీపై ఆర్ఎస్ఎస్ పెద్దలు బహిరంగంగానే ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మాతృ సంస్థకు ప్రధాని మోదీ ఎక్కడ కోపం తెప్పించారు? మణిపూర్ పైన, సమాజంలో విభజనలపైన, ఇతరులను గౌరవించడంపైన మోహన్ భగవత్ అన్న మాటలకు అసలు అర్థం ఏంటి?

ఎన్నికల్లో 375 సీట్లు సొంతంగా సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ.. నిజానికి 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. భారీ మెజారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యం నెరవేరకపోయినప్పటికీ.. పదేళ్ల పాటు వరుసగా అధికారంలో ఉండి కూడా.. జాతీయ స్థాయిలో ఇన్ని సీట్లు సాధించడం, కొన్ని రాష్ట్రాలపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం.. సామాన్య విషయం కాదని బీజేపీని విమర్శించే వారు సైతం ఒప్పుకుంటున్నారు. మోదీ మేనియానే ఈ ఘనతకు కారణం అనే అభిప్రాయం కూడా వినపడుతోంది. అయితే 240 సీట్లకు పరిమితం కావడంపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తితో ఉందని, అందుకే బహిరంగ విమర్శలకు దిగిందని రాజకీయ నిపుణులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

Also Read : మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?