Maharashtra Politics: బీజేపీలో చేరనున్న ఎన్సీపీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత

ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు.

Maharashtra Politics: బీజేపీలో చేరనున్న ఎన్సీపీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత

Updated On : June 20, 2023 / 9:13 PM IST

NCP vs Shivsena: శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ తొందరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారని శివసేన (షిండే వర్గం) సీనియర్ నేత సంజయ్ షిర్సాత్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే (శివసేన), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) నేతృత్వంలోని ప్రభుత్వం సరిగ్గా నడవడం లేదని, అనేక ఎదురీతలతో ప్రయాణం సాగుతోందని, అందుకే ఆ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు.

India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ

ఎన్సీపీ నేత శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై జయంత్ పాటిల్ ఏడవడాన్ని శిర్సత్ డ్రామా అని కొట్టిపారేశారు. ఎన్సీపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అయితే అది ఒక బూటకమని ఆయన అన్నారు. షిండే వర్గానికి చెందిన శివసేన తిరుగుబాటుకు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంగళవారం ముంబైలో ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు ‘ద్రోహుల దినోత్సవం’ జరుపుకున్నారు. దీనిపై స్పందించిన శిర్సత్.. పై విధంగా వ్యాఖ్యానించారు. జయంత్ పాటిల్ బీజేపీలో చేరబోతున్నారని, ఎన్సీపీ తమకు విధేయత నేర్పకూడదని, విపక్ష హోదా ఎన్సీపీకి మోస ఫలితమని సంజయ్ శిర్సత్ నిప్పులు చెరిగారు.

Kottu Satyanarayana : తమ్ముడూ పవన్ కల్యాణ్ జాగ్రత్త.. నిన్ను హత్య చేస్తే ఎవరికి లాభమో తెలుసుకో- మంత్రి కొట్టు సత్యనారాయణ

శిర్సత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత క్లైడ్ క్రెస్టో స్పందిస్తూ.. సంజయ్ షిర్సత్ వాదనను మైండ్ గేమ్‌గా అభివర్ణించారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సీఎం షిండే మధ్య సరైన అవగాహన లేదని, ప్రభుత్వం అనేక ఇబ్బందుల మధ్య ప్రయాణిస్తోందని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే వారు ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. మొదట ఎన్సీపీ నేత అజిత్ పవార్‭ను బీజేపీలో చేరుతున్నారని ప్రచారం చేసి, ఇప్పుడు జయంత్ పాటిల్ పేరు చెప్తున్నారని, ఇదంతా ప్రజలను రాజకీయ చర్చల్లోకి లాగి ప్రభుత్వ తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికేనని ఆయన అన్నారు.