సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ” గ్రేటర్ హైదరాబాదు, నిజామాబాద్ జిల్లాలో సెటిలర్లకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. యస్.ఆర్.డీహెచ్ అప్లికేషన్ ను తెలంగాణ పోలీసు శాఖ తయారు చేసిందని, దీని ద్వారా ప్రవేటు టెండర్ను పిలిచారు. ఈసీ, సీఎస్, గ్రేటర్ కమిషనర్ కలసి పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలనుకున్నారు.
Also Read : టీడీపీనే డేటా దొంగతనం చేసింది : ఢిల్లీ ఈసీకి బీజేపీ కంప్లయింట్
తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఓట్లను తొలగించడానికి ఓ ప్రణాళికను తయారు చేశారు. ఈసీ వద్ద నుంచి ఆధార్ డేటా, ఓటర్ లిస్టును తీసుకున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమగ్ర సర్వే వివరాలను ఈసీ దగ్గరున్న జాబితాతో పోల్చి తెలంగాణా లో ఓట్లను తొలగించారు’’ అని ఆరోపణలు చేశారు. ఇప్పుడు అర్థం పర్ధం లేని డేటా అంశాన్ని తెరమీదకు తెచ్చి ఏపీలోని రైల్వే జోన్, హోదా అంశాన్ని పక్కన పెట్టారని శివాజీ పేర్కోన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు డేటా చౌర్యం చేస్తుంటాయి. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకోవడం నేరమైతే అందరికంటే మొదటి నేరస్థుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే అని శివాజీ అన్నారు. ఆగస్టు 28న మీటింగ్‌లో అమిత్ షా స్వయంగా సీఎంలను అడిగారని , తమ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల వివరాలను తెలియచేయాలని అడిగారని చెప్పారు. ప్రధాని నమో యాప్ లో 30 కోట్ల మంది ప్రజల డేటా ఉంది. అది డేటా చౌర్యం కాదా? అని శివాజీ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని శివాజీ ఆరోపించారు. గతంలో కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌కు పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఓట్ల తొలగింపు స్మూత్‌గా సాగిపోయిందని, ఇప్పుడు అదే తరహాలో జగన్ కు సహకరించేందుకు ఏపీపై కేసీఆర్ గురిపెట్టారని ’ అని శివాజీ అన్నారు.
Also Read : డేటా చోరీ : బాబుపై పీఎస్‌లో కంప్లయింట్