టీడీపీకి షాక్..! వైసీపీలోకి కీలక నేత?

చంద్రబాబు తనకు అన్యాయం చేశారంటూ ఇటీవల ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు.

టీడీపీకి షాక్..! వైసీపీలోకి కీలక నేత?

Muddaraboina Venkateswararao

Muddaraboina Venkateswararao : నూజివీడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నూజివీడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. వైసీపీలో చేరబోతున్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేశారంటూ ఇటీవల ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు.

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, కొలుసు పార్థసారథి టీడీపీలో చేరి నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముద్దరబోయిన.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కంటతడి కూడా పెట్టారు. చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. గతంలోనూ ఇదే విధంగా తనను మోసం చేశారని ముద్దరబోయిన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ముద్దరబోయిన.. సీఎం జగన్ ను కూడా కలిశారు. వైసీపీలో ఎప్పుడు జాయిన్ అవుతారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరితో.. ఆయనను ఎక్కడి నుంచి బరిలోకి దింపుతారు అనేదా ఆసక్తికరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఎక్కడో ఒక చోట ఆయనకు కచ్చితంగా టికెట్ ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గత కొన్ని రోజులుగా ముద్దరబోయిన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలుసు పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం మొదలైన రోజు నుంచి ముద్దరబోయిన అసంతృప్తిగా ఉన్నారు. తనకు కాకుండా పార్థసారథికి టికెట్ ఇస్తారనే సమాచారం అందడంతో.. పార్టీ మారేందుకు ముద్దరబోయిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే నిన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ముద్దరబోయిన. ఈ సమావేశంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మోసం చేశారు అంటూ కన్నీరు కూడా పెట్టుకున్నారు.

Also Read : జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?

పూర్తి వివరాలు..