BRS : ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటం ఎలా సాగింది? అధికారపక్షంపై పోరులో కేటీఆర్ పాత్ర ఎంత?
రెండో ఏడాదిలో బీఆర్ఎస్.. మరింత దూకుడు చూపించబోతోందా? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఏం జరగబోతోంది?

BRS : పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా ప్రజల పక్షమే అన్నట్లు బీఆర్ఎస్ తీరు కనిపిస్తుంది. అనుకోని కారణాలతో అధినేత దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి గెలిచిన వాళ్లు.. బైబై చెబుతున్నారు. ఇలాంటి టైమ్ లో అన్నీ తానై, అన్నింటికి తానై జనంలో ఉంటూ జనంలా ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్. ప్రతిపక్ష పార్టీగా ఏడాదిలో బీఆర్ఎస్ పాత్ర ఎలా సాగింది? సాధించిన విజయాలు ఏంటి?
బీఆర్ఎస్.. రెండు దశాబ్దాల కింద ఉద్యమ పక్షం. పదేళ్లు అధికార పక్షం. ఇప్పుడు ప్రతిపక్షం.. పాత్ర ఏదైనా తగ్గేదేలే అంటోంది గులాబీ పార్టీ. 14ఏళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన, పదేళ్లు తెలంగాణను పాలించినా.. ఏడాది కాలంలో ప్రతిపక్ష పాత్రను పోషించినా అది కేవలం బీఆర్ఎస్ కు మాత్రమ సాధ్యమైంది.
కేటీఆర్ సారధ్యంలో ప్రతిపక్షంగా ఈ ఏడాదిలో బీఆర్ఎస్ తనదైన ముద్ర వేసింది. పార్టీని కాపాడుకుంటూ, ప్రజలకు అండగా ఉంటూ, ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ.. ఏ ఏడాదిలో భిన్నమైన పాత్రలు మోసారు కేటీఆర్. మరి, అధికార పక్షంపై పోరులో కేటీఆర్ పాత్ర ఎంత? రెండో ఏడాదిలో బీఆర్ఎస్.. మరింత దూకుడు చూపించబోతోందా? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఏం జరగబోతోంది?
పూర్తి వివరాలు..
Also Read : మంత్రుల పనితీరుపై ఆరా తీస్తున్న సీఎం రేవంత్.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా మార్పులు, చేర్పులు?