Sunil Deodhar : బీజేపీ-వైసీపీ దోస్తీపై సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్
Sunil Deodhar : జగన్ ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ విషయం స్పష్టమైంది.

Sunil Deodhar
Sunil Deodhar : ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దియోధర్ ఫైర్ అయ్యారు. ఏపీలో రౌడీ పాలన నడుస్తోందన్నారు. బీజేపీ, వైసీపీ దోస్తీ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ-వైసీపీ మధ్య సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఇది స్పష్టమైందన్నారు. ప్రజా వ్యతిరేక, అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతోందన్నారు సునీల్ దియోధర్.
”ఏపీలో బీజేపీ.. వైసీపీతో కలిసి పని చేస్తోందని కొందరు అంటున్నారు. అందులో నిజం లేదు. బీజేపీ, వైసీపీకి మధ్య సంబంధం లేదని వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో స్పష్టమైంది. జగన్ తో కలిసి బీజేపీ పని చేయడం లేదని నిరూపితమైంది. జగన్ ది ప్రజా వ్యతిరేక పాలన. ఏపీలో ఎస్సీల రిజర్వేషన్లను క్రిస్టియన్లకు మళ్లిస్తున్నారు” అని సునీల్ దియోధర్ ధ్వజమెత్తారు.