నారా భువనేశ్వరి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు : బుద్దా వెంకన్న

వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 12:17 PM IST
నారా భువనేశ్వరి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు : బుద్దా వెంకన్న

Updated On : January 3, 2020 / 12:17 PM IST

వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ప్రతిపాదన అంశం రాష్ట్రంలో కలకలం రేపింది. వైసీసీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజధాని మార్పు విషయంలో ఇరు పార్టీల నేతల కామెంట్స్ తారాస్థాయికి చేరాయి. ఒకరినొకరు పోటీ పడి విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తే, టీడీపీ నేతలు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు.

 

శుక్రవారం (జనవరి 3, 2020) బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ భారతి మానీ లాండరీంగ్ కేసుల్లో ముద్దాయ అని ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా ప్రభుత్వ వ్యవహారాల్లో వైఎస్ భారతి కలుగజేసుకుంటుంటే వైసీపీ నేతలు స్పందించడం లేదన్నారు. వైసీపీ నేతల భూ బాగోతాలపై రైతుల మధ్య చర్చకు ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్ లా ఊరికో ఇల్లు కట్టుకోవడం చంద్రబాబుకు తెలియదన్నారు. 

 

చంద్రబాబు.. తన భార్య భువనేశ్వరితో కలిసి బుధవారం(జనవరి1, 2020) రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను, ప్రజలను కలిశారు. రాజధాని కోసం చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా భువనేశ్వరి తన చేతి గాజులు విరాళంగా ఇచ్చారు.

 

చంద్రబాబు దంపతుల అమరావతి పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు చేశారు. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదని.. తీసుకున్న భూములని వైసీపీ నేతలు కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. భువనేశ్వరి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు. చంద్రబాబు దంపతులు అమరావతిలో పర్యటిస్తే వైసీపీ నేతలకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.  

 

రాజధాని తరలింపు ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతం ఆందోళన, పోరాటాలతో దద్దరిళ్లుతోంది. ఇవాళ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు విరుచుకుపడ్డారు.  ఆడవారని కూడా చూడకుండా మగ పోలీసులు ఈడ్చి పడేశారు. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రేపు రాజదాని గ్రామాల బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు.