చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ

ఢిల్లీలో అమిత్ షాని కలిశాక గత ఆరు రోజులుగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు చంద్రబాబు.

చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ

Chandrababu Naidu

Updated On : February 13, 2024 / 11:30 PM IST

Chandrababu Naidu : చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో బిజీగా ఉండటం వల్ల చాలా రోజులుగా పార్టీ నేతలను చంద్రబాబు కలవలేదు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశాక గత ఆరు రోజులుగా హైదరాబాద్ నివాసానికే పరిమితమయ్యారు చంద్రబాబు. సాయంత్రం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుతో ప్రకాశం జిల్లా నేతలు మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహారెడ్డి, నారాయణరెడ్డిలు సమావేశం అయ్యారు.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?

ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భూమా అఖిలప్రియ, బీటెక్ రవిలు కూడా భేటీ అయ్యారు. సత్తెనపల్లి వ్యవహారాలపై చంద్రబాబుతో కన్నా చర్చించారు. ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆత్మకూరుకు వెళ్లాలని ఆనంకు సూచిస్తోంది టీడీపీ అధినాయకత్వం. నెల్లూరు జిల్లా రాజకీయాలపై చంద్రబాబుతో చర్చించనున్నారు ఆనం. అటు నంద్యాల పార్లమెంటులో పార్టీ వ్యవహారాలపై అఖిలప్రియతో చర్చిస్తున్నారు చంద్రబాబు.