మరలా బాబే సీఎం : YCP అరాచకాన్ని అణిచివేస్తాం – బుద్ధా

ఏపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి టీడీపీ రాబోతోందని..సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని.. ప్రజలను బెదిరించే వారిని పోలీసు వ్యవస్థ తాట తీస్తుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 40 రోజులు వారి మాటల తీరు..వారి చేష్టలు చూస్తుంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read Also : లారెన్స్ దెయ్యం సినిమాల సీక్వెల్స్
వైసీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయంటూ టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఈసీ అండ చూసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని బుద్ధా మండిపడ్డారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అరాచక శక్తులను అణచి వేస్తామన్నారు. వైసీపీ కంప్లయింట్స్ చేసిన వెంటనే ఈసీ చర్యలు తీసుకొంటోందని..మరలా వచ్చేది బాబేనంటూ జోస్యం చెప్పారు. మరి బుద్ధా వెంకన్న చెప్పిన మాటలు నిజమౌతాయా ? లేదా ? అనేది మే 23 రోజున తెలుస్తుంది.
Read Also : RRR మూవీపై రూమర్స్ : ప్రభాస్ గెస్ట్ రోల్