బీజేపీ వల్లే తెలంగాణ వచ్చింది : బాబు దీక్షలో ఆమ్ ఆద్మీ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ఏపీ భవన్ లో  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. 

  • Published By: chvmurthy ,Published On : February 11, 2019 / 06:01 AM IST
బీజేపీ వల్లే తెలంగాణ వచ్చింది : బాబు దీక్షలో ఆమ్ ఆద్మీ కీలక వ్యాఖ్యలు

Updated On : February 11, 2019 / 6:01 AM IST

ఢిల్లీ ఏపీ భవన్ లో  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. 

ఢిల్లీ:  ఢిల్లీ ఏపీ భవన్ లో  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది.  ఆప్ కన్వీనర్ భవానీ వీర వరప్రసాద్ దీక్షా శిబారానికి వచ్చి చంద్రాబాబు నాయుడుకు మద్దతు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ ఏపీని  విభజించాలని అనుకోలేదని,  బీజేపీ యే  కాంగ్రెస్ పార్టీని  బెదిరించి విడగొట్టించిందని  ఆయన చెప్పారు. మీరు రాష్ట్రాన్ని  విడగొట్టక పోతే  మేము అధికారంలోకి వచ్చాక విడగొడతామని, కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి  బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టించిందని ఆయన అన్నారు.

గతంలో ఢిల్లీ లో రంగా-బిల్లా అనే ఇద్దరు క్రిమినల్స్ ఉండేవారని, వారే ఇప్పుడు  భారత రాజకీయాల్లో అమిత్ షా, మోడీ అని ఆయన చెప్పారు. వీరిద్దరూ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం  ఉందని ఆయన అన్నారు. ఏపీ హక్కులు సాధించటానికి ఆప్ టీడీపీ కమద్దతిస్తుందని ఆయన తెలిపారు. 
 

Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ పబ్లిసిటీ : ఆర్జీవీ ట్వీట్

Read Also : బాబు దీక్షకి రాహుల్ ఫుల్ సపోర్ట్ : వేదికపై ఇద్దరు నేతల గుసగుసలు