Ambati Rambabu : టీడీపీకి ఇదే చివరి మహానాడు, మళ్లీ వచ్చేది వైసీపీనే- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu : 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర ఉందా? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే పైనున్న ఎన్టీఆర్ కూడా సహించరు.

Ambati Rambabu : టీడీపీకి ఇదే చివరి మహానాడు, మళ్లీ వచ్చేది వైసీపీనే- మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu (Photo : Google)

Updated On : May 28, 2023 / 10:52 PM IST

Ambati Rambabu-Mahanadu : టీడీపీ మహానాడుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి. దుర్మార్గమైన టీడీపీ పాలనను మరొకసారి తీసుకొచ్చే ఆలోచన ప్రజల్లో లేదన్నారు. చంద్రబాబు పదవి దాహం వల్ల ఎన్టీఆర్ గుండె ఆగి మరణించారని అంబటి ఆరోపించారు. ఎన్టీఆర్ మీద ప్రేమ కానీ, గౌరవం కానీ ని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించేందుకు ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను మార్కెటింగ్ చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

” సైకిల్ తుప్పు పట్టిపోయింది. ద్రబాబు, ఆయన పుత్రుడు, దత్తపుత్రుడు కూడా తొక్కలేకపోయారు. స్క్రాప్ కు వెళ్లిన సైకిల్ ను ఇప్పుడు చంద్రబాబు తొక్కాలని చూస్తున్నారు. చంద్రబాబు మహానాడు వేదికగా కొత్త అవతారం ఎత్తారు. అనేక వాగ్దానాలు చేశారు. చంద్రబాబు చరిత్ర ఏంటి? 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇచ్చిన ఒక్క హామీ అన్నా చంద్రబాబు అమలు చేశారా?

Also Read..Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు

చంద్రబాబు బండారం ప్రజలకు తెలుసు. ఆయన చెప్పినవి మాయమాటలని ప్రజలకి తెలుసు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నాలుగేళ్లలో పూర్తి చేసిన ఘనత జగన్ ది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయని 420 చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు చెప్పిన మాటలు వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా మోసం.

వచ్చేది కురుక్షేత్ర యుద్ధమే. చంద్రబాబు ఒక్కడే వస్తారా? ఇంకా ఎవరినైనా వెంట తెచ్చుకుంటారా? 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏ ఒక్క పేదవాడిని ధనవంతుడు చేసిన చరిత్ర ఉందా? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తే పైనున్న ఎన్టీఆర్ కూడా సహించరు. కల్లు తాగిన కోతుల్లా మహానాడు వేదికగా టీడీపీ నేతలు వ్యవహరించారు.

Also Read..NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. ఆ ఫ్యామిలిలో..

చెప్పింది చేసి చూపించిన పార్టీ వైసీపీ. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని హామీలు ఇచ్చినా టీడీపీ గెలిచేది లేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. పేదవాడిని సర్వనాశనం చేసే విధంగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపారు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాడని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలు. భవిష్యత్తు గ్యారంటీ లేని పార్టీ టీడీపీ. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు తాపత్రయం అంతా. జగన్ చిత్తశుద్ధితో వెళ్తున్నారు. చంద్రబాబు మోసపూరిత ధోరణితో వెళ్తున్నారు” అని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.