Bonda Uma : రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి- బోండా ఉమ

Bonda Uma : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.

Bonda Uma : రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి- బోండా ఉమ

Bonda Uma(Photo : Google)

Updated On : May 16, 2023 / 12:48 AM IST

Bonda Uma-Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టారని బోండా ఉమ అన్నారు. లోకేశ్ మండుటెండలో 1,250 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. నేటితో పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుందని చెప్పారు. రాష్ట్రంలో పరిస్ధితులు దారుణంగా ఉన్నాయని బోండా ఉమ వాపోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. దీనికి సాక్ష్యం నారా లోకేశ్ పాదయాత్రకి ప్రజల నుండి లభిస్తున్న అపూర్వ స్వాగతమే అన్నారు.

Also Read..Dharmana Prasada Rao: పారదర్శక చిట్ ఫండ్ వ్యాపారం‌ కోసమే ఇ-చిట్స్ ఎలక్ట్రానిక్ విధానం

175 నియోజకవర్గాల్లో కూడా లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా యాత్ర చేస్తున్నామని బోండా ఉమ తెలిపారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలు స్వచ్చందంగా టీడీపీ పాదయాత్రకి వస్తున్నారని ఆయన చెప్పారు.