Vijay Sai Reddy : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్

Vijay Sai Reddy : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్

Vijay Sai Reddy Slams Prashant Kishor Comments

Updated On : March 6, 2024 / 7:28 PM IST

Vijay Sai Reddy ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు. అంతేకాదు, ఆ మాటలు వెనుక దురుద్దేశం ఉందన్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్ సభ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రజలకి ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని ఆయన తెలిపారు. ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం అన్నారు. వైఎస్ఆర్ గ్రెస్ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

”మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తారు. మూడు సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా వైసీపీ శ్రేణులు హాజరయ్యాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నా. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు.

పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. రాజకీయం వేరు.. స్నేహం వేరు. జిల్లా మీద నాకు పూర్తి అవగాహన ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశా. పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేది” అని విజయసాయిరెడ్డి అన్నారు.

Also Read : పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్..! కాపు నేతలపై స్పెషల్ ఫోకస్