Karnataka New CM : కర్ణాటక కొత్త సీఎం ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ, రేసులో ఆ ముగ్గురు
Karnataka New CM : ఆ ముగ్గురూ కర్నాటకలోని ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందన్న అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Karnataka New CM
Karnataka New Chief Minister : కర్ణాటక ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు మరో ఉత్కంఠ నెలకొంది. అదే కర్నాటక కొత్త సీఎం ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి ఎవరు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..
కర్నాటక ముఖ్యమంత్రి రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, పరమేశ్వర పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురూ కర్నాటకలోని ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతలు. డీకే శివకుమార్ ఒక్కళిగ సామాజికవర్గం, సిద్ధరామయ్య కురబ సామాజికవర్గం, పరమేశ్వర దళిత సామాజికవర్గానికి చెందిన నేతలు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం కర్నాటక సీఎల్పీ మీటింగ్ జరగనుంది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరుకి చేరుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందన్న అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుంధుబి మోగించింది. 136 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు కొత్త సీఎం ఎవరు అనే దానిపైనే ప్రతి ఒక్కరి దృష్టి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ముగ్గురు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా సిద్ధరామయ్య(మాజీ ముఖ్యమంత్రి), డీకే శివకుమార్(కాంగ్రెస్ అధ్యక్షుడు), పరమేశ్వర్(దళిత సామాజికవర్గానికి చెందిన కీలక నేత).
Also Read..Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది
ఈ ముగ్గురి పేర్లు ప్రధానంగా కర్నాటక సీఎం రేసులో వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్నాటకలో యడియూరప్ప తర్వాత అంత సీనియర్ నేత, అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిగా సిద్ధరామయ్యను గుర్తించడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కు అత్యంత సన్నిహిత వ్యక్తి. సీడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నారు. పోల్ సర్వేస్ కానీ, కాంగ్రెస్ అంతర్గతంగా జరిపిన సర్వేల్లో కానీ.. సిద్ధరామయ్య వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్న పరిస్థితి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం కూడా అదేనా అనేది కొన్ని గంటల్లో తేలబోతోంది.