పోస్టు కోసం పోటీ : ఉత్తమ్‌ను తప్పిస్తే.. TPCC చీఫ్ ఎవరో?
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా అసహనంగా ఉన్నారట. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత తన పార్టీ పదవికి రాజీనామా చేసేస్తానని చెప్పడం వెనుక కారణం అదేనంటున్నారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా అసహనంగా ఉన్నారట. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత తన పార్టీ పదవికి రాజీనామా చేసేస్తానని చెప్పడం వెనుక కారణం అదేనంటున్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా అసహనంగా ఉన్నారట. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత తన పార్టీ పదవికి రాజీనామా చేసేస్తానని చెప్పడం వెనుక కారణం అదేనంటున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితం తారుమారైనప్పటి నుంచి పార్టీ పదవి నుంచి ఆయన తప్పుకోవాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.
ఉపఎన్నికల్లో తన సతీమణి ఓటమి తర్వాత ఉత్తమ్‌కుమార్ కొంత కాలం సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నుంచి ఉత్తమ్‌పై పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పార్టీని నడిపించే స్టామినా లేదని, ఆయన హయాంలో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతుందనీ.. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడడం మొదలు పెట్టారు.
తప్పుకోవడమే ఉత్తమం :
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సతీమణి ఓటమి ఉత్తమ్‌ను మరింత నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు చాలా మంది నేతలు ఉత్తమ్‌పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదనుకున్న ఆయన పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడమే ఉత్తమమని డిసైడ్ అయ్యారట. ఆ విషయాన్ని ఈ మధ్యనే బయటక పెట్టారు కూడా. మునిసిపల్ ఎన్నికలు ముగియగానే బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. గత కొంతకాలంగా ఉత్తమ్‌ను ఈ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆయనైతేనే బెటర్ :
ఉత్తమ్‌ను తప్పిస్తారనే ప్రచారం మొదలు కాగానే ఆ పోస్ట్ కోసం నేతల్లో పోటీ మొదలైంది. ఎవరికి వారు తమ స్టామినా చూపించుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ, హైకమాండ్ మాత్రం ఉత్తమ్‌నే కంటిన్యూ అవ్వాలని చెప్పిందంట. ఇప్పుడు ఆయనైతేనే బెటర్ అనుకుందట.
ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలు కూడా వచ్చినందున అవి పూర్తయ్యే వరకూ కొనసాగాలని చెప్పిందంట. దీంతో ఆయన పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోపక్క, ఆయన ఎంపీగా ఉన్నారు. పార్లమెంటు స్థాయిలో కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర పార్టీ బాధ్యతలు చూసుకోవడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారట ఉత్తమ్. అందుకే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట.
హూజుర్ నగర్ ఓటమితో మనస్తాపం :
పార్టీ హైకమాండ్ తనను తప్పించే కంటే తానే బాధ్యతల నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని ఉత్తమ్ భావిస్తున్నారట. అందుకే ఈ మధ్య అలాంటి ప్రకటన చేశారంటున్నారు. ఈ విషయం తెలిసినందు వల్లే ఉత్తమ్ ముందు జాగ్రత్తగా ఓ ప్రకటన చేసేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు సాధించి కొంత ఊరట పొందినా.. పార్టీ నేతల్లో మాత్రం ఉత్తమ్‌కుమార్‌పైన నమ్మకం లేదంటున్నారు.
హూజుర్‌నగర్ ఓటమి తర్వాత మనస్తాపం చెందిన ఉత్తమ్.. సైలెంట్‌గా తప్పుకుంటేనే గౌరవంగా ఉంటుందని భావిస్తున్నారట. అదే సమయంలో ఇలా తనంతట తానుగా తప్పుకుంటే పార్టీ కేడర్‌తో పాటు హైకమాండ్‌లో కూడా తనపై సింపతీ ఉంటుందని అనుకుంటున్నారట. అప్పుడు తననే మరోసారి కంటిన్యూ అవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారట.
ముందే దిగిపోతే మంచిదని:
ఎన్నికల్లో పరాజయాన్ని తన వైఫల్యంగా చూపిస్తున్న నేతల తీరు ఉత్తమ్‌ను బాగా హర్ట్ చేసిందంట. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు సైతం తన అసమర్థతగానే చూపిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారని జనాలు అంటున్నారు. ఇదే సమయంలో తనను మార్చుతారంటూ జరుగుతోన్న ప్రచారం పట్ల కూడా అసహనంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో అధిష్టానం తప్పించే వరకు పదవిని అంటిపెట్టుకుని ఉండి అవమానకరంగా దిగిపోయే కంటే.. తానే పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని గౌరవాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.